Swamy Goud: టీఎన్‌జీవో(TNGO) నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులకు సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎవరికి అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మేము అమ్ముడు పోయే వాళ్ళము అయితే తెలంగాణ ఉద్యమంలో ఉండేవాళ్ళం కాదు. ఉద్యమ సమయంలో మామీద ఆరోపణ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ? తెలంగాణ ఉద్యమ సమయంలో మా పై దాడులు జరిగిన రోజున బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు?. బీజేపీ కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్రలో మేము కూడా ఆయన వెంట నడిచాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్న టీఆర్‌స్‌కు ఓటెయ్యమని చెప్తే తప్పేంటి? ఉద్యోగ సంఘాలను కొనే శక్తి ఎవరికీ లేదు. మా పై చేసే విమర్శలు సద్విమర్శలు అయి ఉండాలని స్వామి గౌడ్ పేర్కొన్నారు.
Read also: రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు