రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్‌కే ఉందని.. కాంగ్రెస్‌కు ఆ స్థాయి లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) అన్నారు. బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని, అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్‌తో సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చించలేదని.. తాము అడిగిన సీట్లు కేటాయించకపోతే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ కొన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయని, తాము అలా కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా బీజేపీ(BJP)ని ఓడించే స్థాయికి కాంగ్రెస్ చేరితే ఇక్కడ కూడా ఆ పార్టీతో సర్దుబాటు చేసుకోవచ్చని, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో సీట్ల గురించి ఇంకా చర్చ జరగలేదన్నారు. తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కోరతామని ప్రకటించారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్‌తో రాజకీయంగా స్నేహంగా ఉంటామని తెలిపారు. బీజేపీ విధానాలను సమర్ధించడం అంత సులువు కాదని, అందుకే కేసీఆర్‌ను సమర్థిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చూస్తున్నదని తమ్మినేని(Tammineni Veerabhadram) చెప్పారు.
Read Also: గుజరాత్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. కోర్టు తుది తీర్పు
Follow us on: Google News, Koo, Twitter