బీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్(Tarun Chugh) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ లీకుల్లో సీఎం కేసీఆర్(CM KCR) హస్తం ఉందని ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి వర్గం ఆలీబాబా 40 దొంగలుగా తయారైందని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, లీకేజీ మాఫియా నడుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని..ప్రజా సునామీలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయన్నారు. ఓ ఎంపీని వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని తరుణ్ చుగ్(Tarun Chugh) ప్రశ్నించారు. అర్థరాత్రి బండి సంజయ్(Bandi Sanjay)ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ ఫోన్‌ను పోలీసులే దొంగిలించారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Read Also: బండి సంజయ్ రాజకీయాలకు పనికిరాడు
Follow us on: Google News, Koo, Twitter