బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ఇన్‌చార్జి తరుణ్ చుగ్(Tarun Chugh) మరోసారి స్పందించారు. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలిపారు. నేతలంతా సమిష్టిగా కలిసి ఎన్నికల సమరంలో ఉంటారని పేర్కొన్నారు. పార్టీలో ముఖ్య నేతలు అందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయని.. రాష్ట్ర నాయకత్వం సమిష్టిగానే పనిచేస్తుందని తరుణ్ చుగ్(Tarun Chugh) తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్నడం అభూత కల్పనంటూ పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్(Nitish Kumar) నేతృత్వంలోని విపక్షాల భేటీకి కాంగ్రెస్‌తో పాటు కేసీఆర్ కూడా హాజరవుతున్నారని.. దీనికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఏం సమాధానం చెబుతారంటూ పేర్కొన్నారు. అంతేగాక, గురువారం నాగర్ కర్నూల్‌లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారన్నారు.