Tarun Chugh |ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా తీహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన లేఖ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది బీజేపీ కుట్రే అని బీఆర్ఎస్ నేతలు స్పందిస్తుండగా.. తాజాగా దీనిపై బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ స్పందించారు. సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన లేఖతో ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) మధ్య బంధం బయటపడిందని, ఈ బంధం లిక్కర్ స్కామ్ దేనని తరుణ్ చుగ్(Tarun Chugh) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ రాష్ట్రం దాటి దేశానికి విస్తరించిందని ఆయన ఆరోపణలు చేశారు. సుఖేశ్ మారిన సూట్ కేసుల సంగతి కూడా పూసగుచ్చినట్లు వివరించాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కార్యాలయానికి పెద్ద పెద్ద సూట్ కేసులు ఎలా వెళ్లాయని చుగ్ ప్రశ్నించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌పై విచారణ జరుగుతోందని, ఈ అంశంపైనా విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. కేసీఆర్ సర్కార్ మునిగి పోయే నావ అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌కు పోయే కాలం దగ్గరపడిందని ఆయన విమర్శలు చేశారు.
Read Also: IPL ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన గుజరాత్.. ధోనీ సేనపై ఘన విజయం
Follow us on: Google News, Koo, Twitter