వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై తీన్మార్ మల్లన్న క్లారిటీ

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) క్లారిటీ ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులందరిలో మల్లారెడ్డి అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు. పూలు అమ్మి, పాలు అమ్మి, బోర్ వెల్ నడిపించి, కష్టపడి పైకి వచ్చానని చెప్పేది మొత్తం ఫేక్ ముచ్చట అని కొట్టిపారేశారు. 30 ఏళ్ల కిందట మా తండ్రి కూడా పాలు, పూల వ్యాపారం చేశాడని, మరి మా తండ్రి ఎందుకు కోటీశ్వరుడు కాలేదని తీన్మార్ మలన్న ప్రశ్నించారు. మల్లారెడ్డి చేసిన అక్రమాల చిట్టా తనవద్ద ఉన్నదని, రాబోయే రోజుల్లో అన్నీ బయటపెడతానని ప్రకటించారు.

- Advertisement -
Read Also: ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తాం.. బీజేపీ కార్యాలయానికి బెదిరింపు లేఖ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...