తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియమించారు. రేవూరి ప్రకాష్ రెడ్డి, బాలూ నాయక్, కౌసర్ మొహియుద్దీన్, కూనంనేనీ సాంబశివరావులను ప్యానెల్ స్పీకర్లుగా అవకాశం దక్కింది. సాధారణంగా అసెంబ్లీకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. అయితే వీరిద్దరూ సభలో లేనప్పుడు ప్యానెల్ స్పీకర్లే సభను తాత్కాలికంగా నడిపిస్తారు. సీనియర్ సభ్యులను ఒకరు లేదా నలుగురిని మించకుండా ప్యానెల్ స్పీకర్లును స్పీకర్ నియమిస్తారు. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లును మాత్రం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.