BJP MP Candidates | లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్‌కు చోటు కల్పించారు. ఇక సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, జహీరాబాద్ నుంచి బీబీ పటిల్, హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్‌కర్నూల్ నుంచి భరత్ ప్రసాద్ పోటీ చేయనున్నట్లు పేర్కొంది.
BJP MP Candidates | మొత్తం 195 అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్-51, మధ్యప్రదేశ్-24, పశ్చిమబెంగాల్ – 27, మధ్యప్రదేశ్- 24, గుజరాత్- 15, రాజస్థాన్ -15, కేరళ-12, తెలంగాణ-9, ఝార్ఖండ్-11, ఛత్తీస్‌గడ్-12, దిల్లీ-5, జమ్మూకశ్మీర్-2, ఉత్తరాఖండ్-3, అరుణాచల్ ప్రదేశ్-2, గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్, దమన్ అండ్ దీవ్ నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నట్లు తెలిపారు. తొలి జాబితాలో 34 మంత్రులు, ఇద్దరు సీఎంలకు అవకాశం కల్పించారు. ఇక ప్రధాని మోదీ వారణాసి నుంచి మరోసారి బరిలో దిగనున్నారు.