Telangana Budget | తెలంగాణ బడ్జెట్ వివరాలు ఇవే..

-

Telangana Budget | తెలంగాణ మధ్యంతర బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని వెల్లడించారు. త్వరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని.. అందుకు తగిన విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

అలాగే రైతు భరోసా’ కింద అర్హులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ పథకం కింద అసలు రైతుల కంటే పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారని విమర్శించారు. ఇక జాబ్ క్యాలెడర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని.. దీంతో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. దళిత బంధు పథకానికి బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించారని.. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు.

Telangana Budget వివరాలు..

మొత్తం వ్యయం- రూ. 2,75,891 కోట్లు

రెవెన్యూ వ్యయం- రూ. 2,01,178 కోట్లు

మూలధన వ్యయం- రూ. 29,669 కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు

ఆరు గ్యారెంటీల అమలుకు- రూ.53,196 కోట్లు

పరిశ్రమల శాఖ రూ.2,543 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు

పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లు

పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు

మూసీ రివర్ ఫ్రాంట్ రూ.1000 కోట్లు

వ్యవసాయ శాఖ రూ.19,746 కోట్లు

ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాలు- రూ. 1,250 కోట్లు

ఎస్సీ సంక్షేమం- రూ. 21,874 కోట్లు

ఎస్టీ సంక్షేమం- రూ. 13,013 కోట్లు

మైనార్టీ సంక్షేమం- రూ. 2,262 కోట్లు

బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం- రూ. 1,546 కోట్లు

బీసీ సంక్షేమం- రూ.8వేల కోట్లు

విద్యా రంగానికి- రూ. 21,389కోట్లు

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు- రూ.500 కోట్లు

యూనివర్సిటీల్లో సదుపాయాలకు- రూ.500 కోట్లు

వైద్య రంగానికి- రూ.11,500 కోట్లు

విద్యుత్ (గృహజ్యోతికి)- రూ.2,418 కోట్లు

విద్యుత్ సంస్థలకు- రూ. 16,825 కోట్లు

గృహ నిర్మాణానికి- రూ. 7,740 కోట్లు

నీటి పారుదల శాఖకు- రూ.28,024 కోట్లు

సమ్మక్క సారలమ్మ జాతరకు- రూ.110 కోట్లు

Read Also: ఈ ఏడాది ఎంతమందికి భారతరత్న ప్రకటించారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...