Telangana |తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం సమీపంలో విభాగాధిపతులకు ట్విన్ టవర్స్ ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయా శాఖల అధికారులు సచివాలయంతో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా సెక్రటేరియట్‌కు సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్థలంలో కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు. కొత్త సచివాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో అన్ని ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ అధికారులు సచివాలయంతో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా సచివాలయానికి సమీపంలో ఇంటిగ్రేటెడ్ స్థలంలో కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు. అన్ని రంగాల ప్రభుత్వ శాఖల హెచ్ వోడీల కింద పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. కొత్త సచివాలయం(New Secretariat) సమీపంలో విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్థలాన్ని ఖరారు చేసిన తర్వాత ట్విన్ టవర్ల(Twin Towers) నిర్మాణం చేపడతామని సీఎం(CM KCR) తెలిపారు.
Read Also:
1. బుల్లెట్లు దింపుతా.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
2. ఉత్కంఠకే ఉత్కంఠను నేర్పిన ఐపీఎల్ ఫైనల్ గేమ్
Follow us on: Google News, Koo, Twitter