ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) దూకుడు పెంచింది. సభలు, డిక్లరేషన్లతో హైస్పీడ్ మెయింటైన్ చేస్తోంది. ఈ క్రమంలోనే అగ్రనాయకులు రాష్ట్ర పర్యటనలను సైతం ఖరారు చేస్తోంది. తాజాగా.. ఈ నెల 26 చేవెళ్లలో ప్రజా గర్జన నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) చీఫ్ గెస్టుగా వస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 29న మైనారిటీ డిక్లరేషన్(Minority Declaration) రిలీజ్ చేస్తామన్నారు. అంతేగాక సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో ఓబీసీ డిక్లరేషన్(OBC Declaration) విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సభకు కర్ణాటక సీఎం హాజరవుతారన్నారు.
ఇక ప్రియాంక(Priyanka Gandhi) చేతుల మీదుగా మహిళా డిక్లరేషన్(Women Declaration) ను ప్రకటిస్తామన్నారు. ఈ రెండింటి కొరకు ఇప్పటికే పార్టీ కమిటీలను ఏర్పాటు చేసిందని, అంశాలను కూడా ఫైనల్ చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత పార్టీ మ్యానిఫెస్టోను సోనియ గాంధీ(Sonia Gandhi) చేతుల మీదుగా వెల్లడిస్తామన్నారు. ఇక ఈ నెల 21 నుంచి 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Telangana Congress | ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను విజయవంతం చేయాలన్నారు.ప్రతీ గడపకు చేరాలి…ప్రతీ తలుపు తట్టేలా కాంగ్రెస్ ను చేరవేయాలన్నారు. ఇప్పటికే పార్లమెంట్ వారీగా కోఆర్డినెటర్లను నియమించామన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.