రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ 75 స్థానాల్లో సులువుగా గెలుస్తుందని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ… టీ కాంగ్రెస్నేతలంతా కష్టపడి పనిచేస్తామన్నారు. పార్టీ జెండాను ఎగురవేస్తామన్నారు. పార్టీ విజయం కోసం అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇతర పార్టీల వారినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ఖర్గే(Mallikarjun Kharge) సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టాలని నొక్కి చెప్పారని వెల్లడించారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వెళ్లిన వాళ్లందరినీ తిరిగి పార్టీలోకి తీసుకురావాలని రాహుల్(Rahul Gandhi) సూచించినట్లు స్పష్టం చేశారు. ఘర్ వాపసీలో భాగంగా చాలా మంది నేతలు వస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ గెలుస్తామన్నారు. ‘బీజేపీ, బీఆర్ఎస్ గురించి కొత్తగా చెప్పేదేముంది? లిక్కర్ స్కామ్‌లో మొత్తం కవిత వ్యవహారం ఉందని బీజేపీ ఎంపీలే చెప్పారు. కానీ ఆమెపైన చర్యలు ఎందుకు లేవు?’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు వెళ్తామన్నారు కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy).
Read Also:
1. జోష్‌లో తెలంగాణ కాంగ్రెస్.. నేడు కీలక సమావేశం
2. తెలంగాణలో తామే కింగ్ మేకర్: MIM చీఫ్ కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat