DGP Anjani Kumar | రేవంత్ రెడ్డిని కలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్(DGP Anjani Kumar) వెళ్లారు. ఎన్నిల ఫలితాల సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీ వెంట పలువురు ఐపీఎస్ అధికారులు సైతం ఉన్నారు. ఆయనకు కల్పించే భద్రతపై ఈ మేరకు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన ఇంటి నుంచి నాంపల్లిలోని గాంధీభవన్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఫలితాలను సమీక్షించడంతో పాటు కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు దారి పొడవునా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

- Advertisement -

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు విజయం ఖాయం చేసుకోగా.. 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also: ఫలితాల్లో కాంగ్రెస్ బోణీ.. రెండు చోట్ల విజయం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...