మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ వేళ వైన్స్ టైమింగ్స్ ఇవే

-

Telangana government gives clarity on wine shops timings for new year celebrations: న్యూ ఇయర్ వేళ మందుబాబులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ సర్కార్. కొత్త సంవత్సరం అనగానే ‘మందు చుక్క, చికెన్ ముక్కతో చిల్ అవుతూ ఎంజాయ్ చేద్దాం ఎంచక్కా..’ అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అయితే ఆరోజు ఎంత టైం వరకు ఓపెన్ ఉంటాయా అనేది మన మందుబాబులకు అతిపెద్ద టెన్షన్. మరి అలాంటి వారి కోసం గుడ్ న్యూస్ చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం.

- Advertisement -

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా ఈ నెల 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం కొనుగోళ్లు కొనసాగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్.. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్, డీజీపీలకు ఉత్తర్వులు జారీ చేశారు. రీటైల్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు.. 2బీ లైసెన్స్ కల్గిన బార్లలో మరుసటి రోజైన జనవరి 1వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు కొనసాగించనున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ కష్టకాలంలో మద్యం విక్రయాలు నిల్చిపోయినందున లైసెన్స్ కల్గిన షాపు ఓనర్లకు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ మద్యం విక్రయాలకు  అవకాశం ఈ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also: చంద్రబాబు సభలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి(వీడియో)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...