Telangana government is likely to announce a new crop insurance scheme: తెలంగాణ వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. దీనికోసం రానున్న బడ్జెట్ సమావేశాల్లో దాదాపు రూ. 500 కోట్ల మేర నిధులు కేటాయించాలని నివేదించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త పథకాన్ని ప్రవేశపెడితే వచ్చే వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగిన తర్వాత నుండి రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడం లేదు. అప్పటి నుండి పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. దీంతో అధికార ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యవసాయ శాఖ సొంత పంటల బీమాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
-
- Advertisement -