విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బీఆర్ఎస్ బిడ్ దాఖలు?

-

సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) కొనుగోలు చేసేందుకు సిద్దమైంది. దీంతో విశాఖ ఉక్కు బిడ్డింగ్ పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ బృందం విశాఖ వెళ్లి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు కార్మికులతో చర్చలు జరపనుంది. ఈనెల 15వరకు బిడ్ దాఖలు చేసేందుకు అవకావం ఉండడంతో ప్లాంట్ కొనుగోలు కోసం బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు దేశంలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థను కొనుగోలు చేసేందుకు వేరే రాష్ట్ర ప్రభుత్వం బిడ్ దాఖలు చేయలేదు.

- Advertisement -

ఇప్పుడు కానీ తెలంగాణ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) కోసం బిడ్ దాఖలు చేస్తే దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిపోనుంది. బీఆర్ఎస్(BRS) పేరుతో దేశ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన కేసీఆర్.. పక్క తెలుగు రాష్ట్రమైన ఏపీలో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ఎజెండాగా ఏపీ ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఏపీలోని అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ(TDP) పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ విశాఖ ఉక్కు కొనుగోలుకు ముందుకు రావడంలో రాజకీయ కోణం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: పొంగులేటి, జూపల్లికి కేసీఆర్ భారీ షాక్.. అధికారిక ప్రకటన విడుదల

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...