Sankranti Holidays | సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యాశాఖ సంక్రాంతి సెలవులను(Sankranti Holidays) ప్రకటించింది. 6 రోజులు సంక్రాంతి సెలవులు ఉందనున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 12 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. ఈ సెలవులు మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు వర్తిస్తాయని తెలిపింది. జనవరి 13 రెండో శనివారం యధావిధిగా సెలవు, జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16 కనుమ సెలవులతో పాటు అదనంగా 17వ తేదీన కూడా సెలవు ఉండనుంది.

- Advertisement -

Sankranti Holidays | కాగా, తెలుగు పండుగలలో ముఖ్యమైన, అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి మూడు రోజుల పండుగ. తెలుగు వారు దేశంలో ఎక్కడ ఉన్న ఈ పండుగకు సొంత ఊళ్లకి చేరుకుని బంధుమిత్రులతో కలిసి సంబురాలు జరుపుకుంటారు. విద్యార్థులు కూడా వేసవి సెలవులతో పాటు సంక్రాంతి, దసరా సెలవుల కోసమే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఈ రెండు పండగలకే ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయని. ఈ క్రమంలో ప్రభుత్వం సంక్రాంతికి 6 రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: రేపు కేసీఆర్‌ను పరామర్శించనున్న సీఎం జగన్‌
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...