కళాకారులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. వేతనాలు పెంచుతూ నిర్ణయం

-

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి(Cultural Sarathi)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ పెంచుతూ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యమంలో పాల్గొన్న 583 మంది కళాకారులను గుర్తించిన ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించింది. ప్రస్తుతం రూ.24,514 వేతనం ఇస్తుండగా తాజా పెంపుతో రూ.31,868 జీతం అందనుంది. కొత్త వేతనాలు 2021 జూన్‌ 1 నుంచి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Cultural Sarathi | తమ గళాల్ని, కలాల్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన కళాకారులకు 2015లో ఉద్యోగాలిచ్చారు. అప్పటి నుంచి వివిధ జిల్లాల్లో పనిచేస్తు ప్రభుత్వ ప్రగతి గీతాలను ఆలపిస్తూ, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యపర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో కళాకారుల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ కళాకారుల వేతనాలను పీఆర్సీసీ-2020 పరిధిలోకి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వేతనాల పెంపు పట్ల కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో సీఎం కేసీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సాంస్కృతిక సారథి చైర్మన్‌ బాలకిషన్‌, ఆ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

Read Also: మంత్రి రోజా భర్త సెల్వమణికు అరెస్ట్ వారెంట్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...