తెలంగాణ గ్రూప్‌2 పరీక్ష కొత్త తేదీలు విడుదల

-

గ్రూప్2 పరీక్ష రీషెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 2, 3వ తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షకు వారం ముందు https://www.tspsc.gov.in వెబ్సైట్ లో హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

- Advertisement -

గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కొంతకాలంగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆగస్టు 29, 30 జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ తెలిపినట్లు చెప్పారు. అర్హత ఉన్న ప్రతి అభ్యర్ధి అన్నీ పరీక్షలు రాసే విధంగా తగిన సమయం ఉండాలని సీఎం చెప్పారన్నారు. సీఎస్ శాంతి కుమారి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌‍తో పాటు సెక్రటరీలతో సమీక్షించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అన్ని విషయాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఎగ్జామ్స్‌ని వాయిదా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు గతంలో 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...