Groups Exam Schedule | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

-

గ్రూప్స్ పరీక్షల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ(TSPSC) శుభవార్త అందించింది. గ్రూప్‌- 1 గ్రూప్‌-2, గ్రూప్‌- 3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల(Groups Exam Schedule) చేసింది. మొత్తం 563 ఉద్యోగాలను గ్రూప్ 1 ద్వారా భర్తీ చేయనుంది. ఈ పరీక్షలకు సంబధించి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుండగా.. మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది.

- Advertisement -

Groups Exam Schedule | అలాగే మొత్తం 783 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో.. 1388 గ్రూప్‌ -3 ఉద్యోగాల భర్తీకి నవంబర్‌ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. గ్రూప్‌ 3 పోస్టులకు సైతం 5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక అభ్యర్థుల వయోపరిమితిని టీఎస్పీఎస్సీ ఇప్పటికే 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. గతంలో గ్రూప్1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు కొత్తగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Read Also: ఇన్నాళ్లూ ఏం అడొచ్చింది.. సీఎం జగన్‌పై షర్మిల సెటైర్లు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...