సంజయ్ అరెస్ట్ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ కు హైకోర్టు అనుమతి

-

Bandi Sanjay Arrest |టెన్త్ పేపర్ లీకుల కేసులో బండి సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ కు హైకోర్టు అనుమతించింది. రేపు ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అర్ధరాత్రి బండి సంజయ్‌ అరెస్ట్‌(Bandi Sanjay Arrest)ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో బీజేపీ(BJP) లీగల్ సెల్ హెబియస్ కార్పస్ పిటిషన్‌(Habeas Corpus Petition)ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చింది. సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని.. అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పేర్కొన్నారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు వెల్లడించలేదని పిటిషన్ లో తెలిపారు. అయితే అంతకుముందు హౌస్‌ మోషన్ పిటిషన్ వేయగా.. విచారణకు హైకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టంచేసింది.

- Advertisement -
Read Also: బండి సంజయ్ అరెస్టుపై రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...