Minister Srinivas Goud |ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య వ్యాఖ్యలు చేశారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్న మంత్రి.. ఆస్కార్ అవార్డుల విషయంలో కేంద్రం తెలుగు వారిపై వివక్ష చూపిందని ఆరోపించారు. నార్త్ ఇండియా సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత సౌత్ ఇండియా సినిమాలకు ఇవ్వలేదని మండిపడ్డారు. ట్రిపులార్‌ను ఆస్కార్‌కు అధికారికంగా ఎందుకు పంపలేదన్నారు. గుజరాత్ సినిమాను ఆస్కార్‌కు పంపి.. ట్రిపులార్‌ను పంపకపోవడం తెలుగు వారిపై కేంద్రం వివక్షతకు సాక్ష్యం అని ఆరోపించారు.
Read Also: భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం: నందమూరి బాలకృష్ణ
Follow us on: Google News