తెలంగాణ(Telangana) చరిత్రలోనే ఇవాళ అత్యధిక స్థాయి విద్యుత్ వినియోగం జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ వినియోగంలో దక్షిణాదిన తెలంగాణ((Telangana)) రెండో స్థానంలో ఉంది. మార్చి 14వ తేదీన ఉదయం 10:03 గంటలకు 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగం(Power Consumption) జరిగినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు వారాల తర్వాత గురువారం ఉదయం 11:01 గంటలకు 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్ వినియోగం పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువైందన్నారు.
Read Also: ‘దేశ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాల్సిందే’
Follow us on: Google News, Koo, Twitter