Telangana |విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మంగళవారం డిమాండ్ ఏర్పడింది. ఈరోజు(28-02-2023) మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 14,794 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గతేడాది ఇదేరోజున గరిష్టంగా 12,966 మెగావాట్ల వినియోగం నమోదవడం గమనార్హం. పెరిగిన సాగు విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాల వల్ల వినియోగం పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయానికే 37 శాతం వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఇంతకుముందు వ్యవసాయానికి 35 శాతం వరకే వినియోగించేవారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Telangana |విద్యుత్ వినియోగంలో రికార్డు సృష్టించిన తెలంగాణ
-