తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ

-

Telangana TDP |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఆ దిశగా కార్యచరణలు ప్రారంభించారు. లీడర్లు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ.. విస్తృతంగా జనాల్లో తిరుగుతున్నారు. తాజాగా.. తెలంగాణ తెలుగు దేశం కూడా అప్రమత్తమైంది. ఈ క్రమంలో మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Telangana TDP |ఇంటింటికీ టీడీపీతో గడపగడపకు వెళ్తున్నామని పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పెరిగిన ధరలు, డబుల్ బెడ్రూం ఇళ్లపంపిణీ, ధరణి పలు అంశాలపై చర్చించామన్నారు. ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాటం చేయాలని నిర్ణయించామని తెలిపారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకొని భరోసా ఇవ్వాలని, కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు.

Read Also: రేవంత్, బండి సంజయ్‌కి బిగ్ షాక్.. రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసిన కేటీఆర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...