వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభరోజైన గురువారం 27 నిమిషాల పాటు సభ నిర్వహించారు. అంతకుమందు బీఏసీలో సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు. మూడ్రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మొదటి రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపంతో సభ వాయిదాపడింది.
ఇవాళ(శుక్రవారం) సభలో పురపాలక చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల బిల్లు, ‘వైద్యవిద్య సవరణ’ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగుల బిల్లు(ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం బిల్లు)తో పాటు మరో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. శనివారం బిల్లులపై చర్చించి, ఆమోదించనున్నారు. అదే విధంగా వ్యవసాయం సంక్షేమంపైనే షార్ట్ డిస్కషన్ ను ప్రభుత్వం చేయనున్నట్లు తెలిసింది. రెండ్రోజుల గడువు సరిపోకపోతే ఆదివారం సైతం అసెంబ్లీని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.