మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాలో కల్తీ కల్లు పలు కుటుంబాల్లో విషాదం నింపింది. కల్తీ కల్లు తాగి ఆసుపత్రిపాలైన వారిలో మృతుల సంఖ్య మూడుకి చేరింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కాగా ఈ ఘటనపై స్పందించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud).. మృతుల మరణానికి కల్తీ కల్లు కారణం కాదని, అనారోగ్యంతోనే మృతి చెందారని అన్నారు. మెడికల్ రిపోర్ట్స్ లో అదే తేలిందని చెప్పారు. శవ పరీక్ష కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించామని, రిపోర్టులో కల్తీ కల్లు కారణంగా మరణించారని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు మాత్రం కల్తీ కల్లు కారణంగానే వారు మరణించారని ఆరోపిస్తున్నారు. కల్తీ కల్లు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
Read Also: TSPSC కేసులో ఆ ఇద్దరు అధికారులకు ఈడీ నోటీసులు
Follow us on: Google News, Koo, Twitter