Revanth Reddy Padayatra: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్ర జనవరి 26 న ప్రారంభం కానుంది. పాదయాత్రకు సంబందించిన ప్రణాళిక సిద్దమైంది. ఇప్పటికే రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుండి ‘హత్ సే హత్ జోడో’ అనే కార్యక్రమం ద్వారా రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పాదయాత్ర మొదలెట్టనున్నారు. 126 రోజుల పాటు 99 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి సంక్షేమ పథకాలను అందించనుందో వివరించనున్నారు. ఈ నెల 26 న భద్రాచలం లో ప్రారంభమై ఆదిలాబాద్ లో ముగియనుంది.