TS Polycet Results |పాలిటెక్నిక్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులు, అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు(TS Polycet Results) విడులయయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పాలిసెట్ లో మొత్తం 82.7 శాతం మంది అర్హత సాధించారు. కాగా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలురకు 78.62 శాతం మంది పాసవ్వగా బాలికలు 86.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఈనెల 17న నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 98,274 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా 80,752 మంది ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు. వీరిలో బాలురు 43006 మంది, బాలికలు 37746 మంది ఉత్తీర్ణత సాధించారు.
Read Also:
1. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 40 చోట్ల ఐటీ సోదాలు
2. స్కూల్లోనే కొట్టుకున్న టీచర్-ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
Follow us on: Google News, Koo, Twitter