TSPSC Paper Leak |టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మార్చి 31వ తేదీన సిట్‌పై చేసిన ఆరోపణలకు సిట్ అధికారలు శుక్రవారం స్పదించారు. తాము ఎవరికీ డేటా ఇవ్వలేదని కోర్టుకు నివేదికను ఇస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థుల విచారణ పూర్తి చేశామని.. పేపర్ లీకేజీ కేసులో బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చామని సిట్ అధికారులు తెలిపారు. బోర్డు చైర్మన్, సెక్రెటరీ వాగ్మూలం రికార్డ్ చేస్తామని.. లింగారెడ్డికి నోటీస్ జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే లింగా రేడ్డి పీఏ రమేష్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు చెప్పారు. Tspscలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్‌తో లింగారెడ్డికి నోటీసులు పంపినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) అంశం లింగారెడ్డికి తెలుసా.. అనే కోణంలో అరా తీస్తున్నమని అధికారులు చెప్పారు.
Read Also: ప్రధాని సర్టిఫికేట్లతో నీకేం పని.. ఢిల్లీ సీఎంకు హైకోర్టు షాక్!
Follow us on: Google News, Koo, Twitter