TSPSC Paper Leak Case |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. సిట్(SIT) అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రాలను సంతల్లో సరుకుల్లా నిందితులు అమ్మేసుకున్నారు. ఏఈ(AE) ప్రశ్నాపత్రాన్ని నిందితుడు డాక్యానాయక్ బంధువు రాజేశ్వర్ కు ఇవ్వగా.. మూడు పేపర్లను రూ.40లక్షలు చొప్పున ముగ్గురికి అమ్మినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.25లక్షలను అడ్వాన్స్ తీసుకున్న రాజేశ్వర్.. మిగిలిన డబ్బును ఫలితాల తర్వాత ఇచ్చేలా అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నాడు.
TSPSC Paper Leak Case |రేణుకకు పేపర్ లీక్ చేసిన ఏ1 నిందితుడు ప్రవీణ్.. నమ్మకమైన వారికి మాత్రమే అమ్మాలని సూచించాడు. దీంతో తన సమీప బంధువైన రాజేశ్వర్ కు రేణుక భర్త డాక్యానాయక్ పేపర్ ఇచ్చాడు. అనంతరం రాజేశ్వర్ ముగ్గురు అభ్యర్థులకు ఆ పేపర్ అమ్మాడు. అలా అడ్వాన్స్ గా వచ్చిన రూ.25లక్షల్లో రూ.10లక్షలు డాక్యానాయక్ కు ఇవ్వగా.. అందులో నుంచి రూ.5లక్షలు ప్రవీణ్ కు డాక్యానాయక్ అందజేశాడు. ఇలా మొత్తం చైన్ ప్రాసెసింగ్ లా పేపర్ లీక్ అమ్మకం వ్యవహారం జరిగింది. మరోవైపు ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు భావిస్తున్న ఈడీ(ED) అధికారులు నిందితులను తిరిగి విచారించనున్నారు.
Read Also: వృద్ధ భార్య రోజూ చేసే పని రహస్యం తెలిసి.. నవ వధువు ఆశ్చర్యపోయింది
Follow us on: Google News, Koo, Twitter