టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case)లో ఈడీ దూకుడు పెంచింది. ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేసింది. TSPSC కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్‌ఛార్జి శంకర్ లక్ష్మీ, అసిస్టెంట్ సెక్షన్ అధికారి సత్యనారాయణలకు నోటీసులు ఇచ్చింది. ఈరోజు, రేపు విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించింది.
కాగా ప్రవీణ్, రాజశేఖర్‌ల వాంగ్మూలాల నమోదుకు కోర్టు అనుమతి కోరారు అధికారులు. నిధుల మళ్లింపు కోణంలోనే ఈడీ విచారణ కొనసాగుతోంది. కమిషన్ ఛైర్మన్‌తోపాటు కార్యదర్శి, సభ్యులను ఈడీ విచారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేపర్ లీక్ కేసులో TSPSC అధికారులకు వరుసగా నోటీసులు ఇస్తుండటంతో ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?
Follow us on: Google News, Koo, Twitter