రేవంత్ రెడ్డి, కవిత మధ్య ట్విట్టర్ వార్

-

తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్‌ పెట్టాయి పార్టీలు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ప్రచారంపై దృష్టి పెట్టింది. మరోవైపు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth Reddy).. ఆ తర్వాత బెంగళూరు వెళ్లారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు డీకేతో కలిసిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు రేవంత్‌రెడ్డి. తెలంగాణ రాజకీయ పరిణామాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించామని పేర్కొన్నారు.

- Advertisement -

డీకే, రేవంత్‌(Revanth Reddy) భేటీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత(MLC Kavitha) నిప్పులు చెరిగారు. రేవంత్‌, డీకే దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం… ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం’ అంటూ ధ్వజమెత్తారు. కవిత ట్వీట్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. “గల్లీలో సవాళ్లు..ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు ఇది కేసీఆర్‌ మ్యాజిక్కు..జగమెరిగిన నిక్కర్‌..లిక్కర్‌..లాజిక్కు” అంటూ విమర్శలు చేశారు.

మరోవైపు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలిశారు. కాంగ్రెస్‌లో చేరిక, పార్టీ విలీనంపై గతంలో పలు సార్లు డీకే శివకుమార్​తోనూ ఆమె భేటీ అయ్యారు. వైఎస్​ఆర్​టీపీ పార్టీ విలీనం అంశంలోనూ డీకే శివ కుమార్​ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీకేను కలిసేందుకు రేవంత్​ బెంగళూరుకు వెళ్లినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వైఎస్​ఆర్టీపీ విలీనంపై చర్చించినట్లు తెలుస్తోంది.

 Read Also: జమిలీ ఎన్నికల కమిటీ ప్రకటన.. చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...