Bandi Sanjay | కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీం: బండి సంజయ్

-

Bandi Sanjay Controversial Comments | ఎమ్మెల్సీ ఎన్నికల నడుమ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం అసెంబ్లీ ఎన్నికల తరహాలో రాజకీయ పార్టీలు ట్రీట్ చేస్తున్నాయి. అందుకోసమే ఎమ్మెల్సీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి బడాబడా నేతలు బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరపున బండి సంజయ్, కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రచారం చేయగా, కాంగ్రెస్(Congress) తరపు అభ్యర్థుల తరపున ముఖ్యమంత్రే ప్రచార బరిలోకి దిగారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీది భారత్ టీమ్ అని కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీమ్ అంటూ వ్యాఖ్యానించారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు.

- Advertisement -

‘‘మాది భారత్ టీం…వారిది పాకిస్తాన్ టీం. ఇండియా గెలవాలంటే బిజేపి(BJP) కి ఓటు వేయండి. పొలిటికల్ మ్యాచ్ లో కూడా గెలిచే అవకాశం మాకు ఇవ్వండి. ఎమ్మెల్సీ ఎన్నికలలో(MLC Elections) ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదు. మూడు‌సభలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మాకు వచ్చిన నష్టం లేదని ముఖ్యమంత్రే అన్నారు. కులగణన కి(Caste Census) మేము వ్యతిరేకం కాదు. 42% బిసిలకి రిజర్వేషన్లు ఇస్తామంటే మేము స్వాగతిస్తాం. కాని బిసిలలో ముస్లీం లకి రిజర్వేషన్ లు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మా బిసిలకి ఇచ్చేది 32% మాత్రమే. గుజరాత్, మధ్యప్రదేశ్‌లతో అభివృద్ధిలో పోటీ పడుతారా?’’ అని Bandi Sanjay ప్రశ్నించారు.

Read Also: ‘మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: రేవంత్

తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్...

Annamayya District | గూండాల కోనలో గజేంద్రల బీభత్సం.. ముగ్గురు మృతి

Annamayya District | అన్నమయ్య జిల్లాలోని గూండాలకోన దగ్గర గజరాజులు బీభత్సం...