అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్ రానున్నదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఆశావహులంతా సెగ్మెంట్‌లలో తిరగాలన్నారు. ప్రజలతో ప్రోగ్రామ్‌లు పెట్టాలన్నారు. టిక్కెట్ వచ్చేంత వరకు వెయిటింగ్ చేయడం సరికాదని నొక్కి చెప్పారు.టికెట్ వస్తేనే పని చేయాలనే ఆలోచనను పక్కకు పెట్టాలన్నారు. ఆశావాహులంతా ప్రజల్లో తిరగాలని అన్నారు.
తెలంగాణలో బీజేపీ(BJP) పోటీలో లేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోటీ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు 70 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియంతలా, సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్(Uttam Kumar Reddy) సూచించారు.