పంచాయితీ కార్యదర్శుల డిమాండ్లు న్యాయమైనవే: MP ఉత్తమ్

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR)కు కాంగ్రెస్ కీలక నేత, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) బహిరంగ లేఖ రాశారు. జూనియర్​పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్​చేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు(Junior Panchayat Secretaries) సమ్మె చేస్తున్నా.. పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటి పోయిందన్నారు. 2018 నూతన పంచాయితీరాజ్ చట్టం మేరకు గ్రామాల అభివృద్ధి కోసం మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్‌తో 2019 ఏప్రిల్ 12న 9,355 మంది పంచాయితీ కార్యదర్శులుగా నియమించారని, కానీ నాలుగేళ్లు గడిచినా రెగ్యులర్ చేయకపోవడం సరికాదన్నారు. జేపీఎస్‌లవి న్యాయపరమైన డిమాండ్లేనని, తక్షణమే సీఎం హోదాలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 56 రకాల విధులు, 42కు పైగా రికార్డుల బాధ్యతలు నిర్వర్తిస్తూ 12 గంటల పాటు పనిభారంతో సతమతమవుతున్నారన్నారు. ఇప్పటికే చాలామంది తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. చనిపోయిన పంచాయితీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలని ఉత్తమ్(Uttam Kumar Reddy) కోరారు.

- Advertisement -
Read Also: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు: MLA

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...