కేసీఆర్ పై పోరాడాలని ఈటల, రేవంత్ కు విజయశాంతి సూచనలు

-

Vijaya Shanthi |తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.25కోట్లు ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల వ్యాఖ్యలపై మండిపడ్డ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).. డబ్బులు తీసుకున్నట్లు చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణం చేస్తావా? అని ఈటలకు సవాల్ విసిరారు.

- Advertisement -

ఇరువురి నేతల సవాళ్ల పర్వంలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijaya Shanthi) స్పందించారు. ‘దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోంది. మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిది. తమ్ముళ్లు రేవంత్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు ఇద్దరూ బీఆర్ఎస్ పై పోరాడే వాళ్లే. ఇద్దరూ ఒకరిపై మరొకరు కాకుండా… ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరం. ఈ విషయాన్ని తెలంగాణ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరూ ఆలోచించాలని నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల తరపున అభిప్రాయం చెప్పడం నా బాధ్యత అనిపించింది’అని ఆమె ట్వీట్ చేశారు.

మరోవైపు ఇప్పుడు ఈ ఎపిసోడ్ లోకి బీఆర్ఎస్ నేతలు కూడా ఎంటర్‌ అయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ రూ.25కోట్లు ఇచ్చారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బీజేపీలో ప్రాధాన్యం దొరక్క ఈటల సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కొత్త నాటకానికి తెరవేపాయని విమర్శించారు. ఎన్ని నాటకాలు ఆడినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని కౌశిక్ జోస్యం చెప్పారు.

Read Also: ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ అంటున్న టైమ్స్ నౌ సర్వే

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...