Revanth Reddy |ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘అయ్య గల్లీలో లిక్కర్ దందా చేస్తే.. బిడ్డ ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తోంది. అవినీతి పంపకాల్లో పీఎం మోడీ, సీఎం కేసీఆర్‌కు తేడా వచ్చింది. అందుకే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు దోపిడీ చేసి దొరికితే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం..? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌కు.. తెలంగాణకు సంబంధం లేదు’ అన్నారు. సీబీఐ, ఈడీతో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతుండని గొంతు చించుకొని చెప్పినా వినలేదు. కాంగ్రెస్ చీఫ్ సోనియాను అవమానించేందుకు ఈడీ తన ఆఫీసుకు పిలిచినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని రేవంత్ (Revanth Reddy) మండిపడ్డారు.
Read Also: TSPSC నియామక పరీక్షలు వాయిదా
Follow us on: Google News