ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 3డీ దేవాలయం(First 3D Temple) తెలంగాణలో నిర్మాణం కానుంది. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రా టెక్ ఈ 3డీ ప్రింటెడ్ ఆలయాన్ని నిర్మించనుంది. ఈ ఆలయం 3డీ ప్రింటెడ్ ఆర్కిటెక్చర్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టనుంది. సింప్లిఫోర్జ్ చేత అంతర్గతంగా అభివృద్ధి చేసిన సిస్టమ్, దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్‌వేర్‌తో ఈ 3డీ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నిర్మితమవుతున్న త్రీడీ ఆలయం ఇదే కావడం విశేషం.
First 3D Temple |ఈ ఆలయాన్ని 30 అడుగుల ఎత్తులో 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ హిందూ దేవాలయాన్ని మొత్తం మూడు భాగాల నిర్మాణం జరగనుంది. ఇందుకు సంబంధించిన నమూనాలు కూడా విడుదల చేశాయి. ఈ ఆలయంలో మొత్తం మూడు గర్భాలయాలు ఉంటాయి. గణేషుడు ఆలయం ‘మోదక్’ ఆకారంలో.. శివుడి ఆలయం దీర్ఘచతురస్రాకారంలో… పార్వతి దేవి ఆలయం కమలం ఆకారంలో.. సిద్దిపేట జిల్లాలోని చర్విత మెడోస్‌లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.