ప్రపంచంలోనే తొలి 3డీ దేవాలయం.. తెలంగాణలో ఏర్పాటు!

-

ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 3డీ దేవాలయం(First 3D Temple) తెలంగాణలో నిర్మాణం కానుంది. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రా టెక్ ఈ 3డీ ప్రింటెడ్ ఆలయాన్ని నిర్మించనుంది. ఈ ఆలయం 3డీ ప్రింటెడ్ ఆర్కిటెక్చర్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టనుంది. సింప్లిఫోర్జ్ చేత అంతర్గతంగా అభివృద్ధి చేసిన సిస్టమ్, దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్‌వేర్‌తో ఈ 3డీ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నిర్మితమవుతున్న త్రీడీ ఆలయం ఇదే కావడం విశేషం.

- Advertisement -

First 3D Temple |ఈ ఆలయాన్ని 30 అడుగుల ఎత్తులో 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ హిందూ దేవాలయాన్ని మొత్తం మూడు భాగాల నిర్మాణం జరగనుంది. ఇందుకు సంబంధించిన నమూనాలు కూడా విడుదల చేశాయి. ఈ ఆలయంలో మొత్తం మూడు గర్భాలయాలు ఉంటాయి. గణేషుడు ఆలయం ‘మోదక్’ ఆకారంలో.. శివుడి ఆలయం దీర్ఘచతురస్రాకారంలో… పార్వతి దేవి ఆలయం కమలం ఆకారంలో..  సిద్దిపేట జిల్లాలోని చర్విత మెడోస్‌లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

Read Also:
1. రజినీకాంత్ ‘జైలర్’ నుంచి సూపర్ అప్‌డేట్
2. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...