యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్ట(Yadagiri Gutta)గా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy) తెలిపారు. ఈ మేరకు త్వరలోనే జీవో ఇస్తామని స్పష్టంచేశారు. దీంతో ఇక నుంచి యాదగిరిగుట్టగానే పరిగణమిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే కేటీఆర్ గురించి మాట్లాడుతూ తాను ఉద్యమాలు చేసి రాజకీయాల్లోకి వచ్చానని.. ఆయన తండ్రి చాటు బిడ్డగా వచ్చాడని ఎద్దేవా చేశారు. అంతే తప్ప కేటీఆర్‌కు జీరో నాలెడ్జ్ అంటూ సెటైర్లు వేశారు .నాలెడ్జ్ లేని కేటీఆర్(KTR) గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్లిపోతారంటూ ఆరోపించారు.
తమ పార్టీ ఎంపీ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతోందన్నారు. భువనగిరి నుంచి పోటీ చేయమని రాహుల్ గాంధీకి చెప్పానని తెలిపారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండ మూడు పార్లమెంట్ స్థానాల్లో సౌత్ ఇండియాలో టాప్ మెజార్టీ కాంగ్రెస్‌కు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని కోమటిరెడ్డి వెల్లడించారు. కాగా కేటీఆర్ రాజీనామా చేస్తే.. తాను నల్లగొడంలో రాజీనామా చేస్తానని.. ఇద్దరం సిరిసిల్లలోనే పోటీ చేద్దామని సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కోమటిరెడ్డి(Komatireddy) సవాల్ విసిరారు.