వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను(YS Sharmila) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన షర్మిలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కమిషన్ల కోసం రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నారు.
Read Also: TSPSC: గ్రూపు-1 ప్రిలిమ్స్ పేవర్ లీక్?
Follow us on: Google News