హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case) దర్యాప్తు సిట్ విచారణ సరిగా లేదని ఆరోపిస్తూ.. ఆమె సిట్ కార్యాలయానికి బయలుదేరారు. షర్మిల(YS Sharmila) ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె కారులో బయలుదేరబోతుండగా పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షర్మిల పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి గురయ్యారు. పోలీసులను పక్కకు తోస్తూ ముందుకు సాగారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆమె రోడ్డుపై భైఠాయించారు.
దీంతో కాసేపు షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అయినా కానీ ఆమె ముందుకే వెళ్లడంతో బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల తీరపై షర్మిల(YS Sharmila) తీవ్రంగా మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఎక్కడ ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నందుకు ఆమెపై కేసు నమోదుచేశారు.
Read Also: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
Follow us on: Google News, Koo, Twitter