టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు శనివారం ఉదయం వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలపై ఉమ్మడిగా పోరాడుదామని షర్మిల వారిని కోరినట్లు సమాచారం. పోరాటానికి సంబంధించి ఉమ్మడి కార్యచరణ సిద్ధం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రగతి భవన్‌కు మార్చ్‌కు పిలుపునిద్దామని ఇరు నేతలకు షర్మిల సూచించారు.
కేసీఆర్(KCR) మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అనివార్య పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని అన్నారు. కాగా, షర్మిల ప్రకటించిన ఉమ్మడి పోరాటానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) మద్దతు తెలిపారు. అంతేకాక, అతి త్వరలో సమావేశం అవుదామని షర్మిలకు బండి సంజయ్ హామీ ఇచ్చారు. వందశాతం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం అయ్యే సమయం ఆసన్నమైందని బండి సంజయ్ అన్నారు. మరోవైపు.. షర్మిల(YS Sharmila) రిక్వెస్ట్‌పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పినట్లు సమాచారం.
Read Also: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిఖత్ జరీన్‌కు గ్రాండ్ వెల్‌కమ్
Follow us on: Google News, Koo, Twitter