YS Sharmila counters on congress leader jaggareddy comments: తెలంగాణలో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్లు షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌టీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఘాటుగా స్పందించారు. జగ్గారెడ్డి థర్డ్ క్లాస్ మనిషి అని ధ్వజమెత్తారు. అసలు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరమే లేదని తోసిపుచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. తాలిబన్లలాగా కేసీఆర్ తెలంగాణలో పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. కొడుకు ల్యాండ్ బ్యాంక్, కూతురు లిక్కర్ బ్యాంక్, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే బాగుపడిందన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఏపీలో సీఎం మీ అన్ననే కదా అక్కడ సమస్యలు లేవా అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే షర్మిల (YS Sharmila) ఫైనాన్స్ వ్యవహారాన్నీ బయటపెడతాననీ.. తెలంగాణకు షర్మిల కోడలే తప్ప.. కూతురు కాదని జగ్గారెడ్డి కామెంట్ చేసిన విషయం తెలిసిందే.