YS Sharmila |గత నాలుగైదు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో రైతులు పంటనష్టపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా.. అకాల వర్షాలపై వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా పొలాలను పరిశీలించలేదని మండిపడ్డారు.
గతంలో ప్రభుత్వాల ద్వారా వచ్చే సబ్సిడీలు అన్ని కలిపితే రైతులకు 30 వేల వరకు లాభం చేకూరేదని.. కానీ ఇప్పుడు రైతుబంధుతో ఎకరానికి 5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ సర్కారు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఇందుకేనా తెలంగాణ సాధించుకుంది అని నిలదీశారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం చిన్న అమరాది కుర్దు గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను వైఎస్ షర్మిల(YS Sharmila) పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు వైఎస్సార్టీపీ పోరాటం చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.
Read Also: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. ఎందుకంటే?
Follow us on: Google News Koo