కేసీఆర్‌కు మహిళా దినోత్సవం గుర్తుండటానికి కారణం అదే: షర్మిల

-

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఏడాది కాబట్టి కేసీఆర్‌కు మహిళా దినోత్సవం గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్న కేసీఆర్, మూడేండ్లుగా దాదాపు 4వేల కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలోని 46.10లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు పట్టుమని 750 కోట్లు ఇచ్చి, మహిళలపై మరోసారి కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్(KCR) తీరుతో మహిళలే ఆపసోపాలు పడి, బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మహిళల పట్ల కేసీఆర్‌కు నిజంగానే ప్రేమ ఉంటే పూర్తిగా 4వేల కోట్ల బకాయిలు చెల్లించి, అప్పుడు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల((YS Sharmila)) డిమాండ్ చేశారు. రూ. 750 కోట్లకు చిన్నదొర కృతజ్ఞత చెప్పడం మానేసి, కేసీఆర్ ముక్కు పిండి బకాయిలు వసూలు చేయించాలని సూచించారు.

- Advertisement -
Read Also: ఇలాంటి చర్యలకు కేసీఆర్ లొంగడు.. నోటీసులపై కవిత ఘాటు స్పందన

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...