పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్టైన వైపీపీటీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila)కు 14రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలులో ఉన్న షర్మిలను ఆమె తల్లి విజయమ్మ(YS Vijayamma) పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆమెకు ధైర్యం చెప్పారు. మరోవైపు అమెకు బెయిల్ కోసం లాయర్లు కృషి చేస్తున్నారు. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
నేడు ఈ పిటిషన్ ను న్యాయస్థానం విచారించనుంది. దీంతో ఆమెకు బెయిల్ లభిస్తుందో లేదో కాసేపట్లో తేలనుంది. ఒకవేళ బెయిల్ లభించకపోతే మే 5వరకు షర్మిల జైలులోనే ఉండాల్సి వస్తోంది. కాగా సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులపై చేయి చేసుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
Read Also: హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాశ్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter