ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) మరోసారి మండిపడ్డారు. వైఎస్‌ఆర్ కట్టించిన ప్రాజెక్టులను కేసీఆర్ తన ఖాతాలో వేసుకొని డబ్బా కొట్టుకుంటున్నాడని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. కష్టం ఒకరిదైతే ప్రచారం మరొకరది సామెత కేసీఆర్‌కు సరిపోతుందని విమర్శించారు. పాలమూరు కన్నీళ్లను చూసి సాగునీళ్లు ఇచ్చింది YSR అయితే… కేసీఆర్ తానే జలకళ తెచ్చినట్లు గప్పాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. పడావు పడ్డ బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. YSR హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. మీ పదేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు అదనంగా సాగునీరు ఇచ్చారా దొర గారు? అని ట్విట్టర్ వేదికగా షర్మిల(YS Sharmila) ఎద్దేవా చేశారు.