YS Sharmila |టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి వైఎస్‌ఆర్ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలనడం రేవంత్ రెడ్డి కోరుతుండటం చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి నాడు వైఎస్ఆర్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి.. నేడు వైఎస్ఆర్ పేరు చెప్పి ఓట్లు అడగటమేంటని ప్రశ్నించారు. రేవంత్ దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. రాజశేఖర్ రెడ్డి మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా అని నిలదీశారు. పులితోలు కప్పుకున్నంత మాత్రాన నక్క పులి కాదని, రేవంత్ రెడ్డి అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ లాంటివాడని ఎద్దేవా చేశారు. పాదయాత్ర అనే పదాన్నే రేవంత్ రెడ్డి అపహాస్యం చేస్తున్నాడని ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు.
Read Also: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చూడాలనుందా.. ఇదే మంచి చాన్స్!
Follow us on: Google News